విజయనగరం: పాచిపెంట మండలంలో తోటవలస గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తుతెలియని రైలు ఢీ కొని మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ శ్రీనివాస్ రావు గురువారం తెలిపారు. వివరాల్లోకి వెళితే తండ్రి చిన్న తనంలోనే చనిపోవడంతో పెద్దమ్మ రూపవతి వద్ద వుంటూ పెరిగి ఈ మధ్య హైదరాబాద్ లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వారి గ్రామంలో వినాయక చవితికి వచ్చి తిరిగి 14 వ తేదీ బుధవారం వారి గ్రామం నుండి బయలుదేరి బొబ్బిలి వచ్చి బొబ్బిలి పాత రైల్వే గేట్ వద్ద కాలక్రుత్యాల నిమిత్తం ట్రాక్ దాటుతుండగా ఏదో గుర్తు తెలియని రైలు ఢీ కొన్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్ఐ శ్రీనివాస్ రావు తెలిపారు.