విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం వద్దగల జిందాల్ కర్మాగారంలో గురువారం ఓ కాంట్రాక్టు కార్మికుడు అకస్మాత్తుగా మృతిచెందాడు. కంపెనీ కార్మికులు ఇచ్చిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్టణం జిల్లా సబ్బవరం మండలం మల్లునాయుడుపాలెం గ్రామానికి చెందిన సిరపురపు రాంబాబు (51) గురువారం జనరల్ షిఫ్టు డ్యూటీకి వచ్చి విధులకు హాజరయ్యాడు. విరామ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు. వెంటనే అంబులె న్స్పై ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు.
మృతిడికి భార్యతోపాటు పాప, బాబు ఉన్నారు. ఈయన మృతికి కార్మిక సంఘాల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కంపెనీ యాజమాన్యం కార్మికులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని సీఐటీయూ నాయకులు గాడి అప్పారావు, బొట్టా రాము కోరారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సీహెచ్సీకి తరలించారు. ఈ ఘటనపై కొత్తవలస ఎస్ఐ హేమంత్ కేసు నమోదు చేశారు.