ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దమ్ముంటే 'మనసులో మాట' పుస్తకాన్ని బయటకు తీసుకురండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 16, 2022, 01:34 PM

ఏపీ శాసన మండ‌లి సమావేశాలు రెండోరోజు సమావేశాల్లో భాగంగా.. ఉద్దేశపూర్వకంగా స‌భ‌ను అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వాపోయారు. ఈ సందర్భంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు టీడీపీ నాయకుల పద్దతి ఉందని  ఎద్దేవా చేశారు. ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అంబటి తెలిపారు. 


సభాకార్యక్రమాలను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే యత్నం చేస్తున్నారని, మంత్రి ప్రసంగాన్ని అడ్డుకోవడం సముచితమేనా? అని మండలి చైర్మన్‌ టీడీపీ సభ్యులను ప్రశ్నించారు. చంద్రబాబు 'మనసులో మాట' పుస్తకాన్ని దాచేశార‌ని, 2014 మేఫెస్టోను కూడా దాచేశార‌న్నారు. దమ్ముంటే 'మనసులో మాట' పుస్తకాన్ని బయటకు తీసుకురండి అంటూ మంత్రి అంబటి రాంబాబు స‌వాలు విసిరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com