విజయనగరం, సాలూరు: సీపీఎస్ ను రద్దు చేసి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ ను అమలు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మురళీ మోహన్ డిమాండ్ చేశారు. సీపీఎస్‌పై ఈ నెల 18న పార్వతీపురంలో జరగనున్న జిల్లాస్థాయి సదస్సుకు సంబంధించి గురువారం సాలూరులో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సుకు సీపీఎస్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు తప్పకుండా హాజరుకావాలని కోరారు.