‘డ్వాక్రా సంఘాల్లోని పేద అక్కచెల్లెమ్మలకు ప్రతీ ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు పార్టీలు కూడా చూడకుండా వైయస్‌ఆర్ ఆసరా పథకం ద్వారా బకాయిలు మొత్తాన్ని నాలుగు విడతలుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అని డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ... రాష్ట్రంలో మొత్తం 7.97 లక్షల డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. మొత్తం సభ్యులు 78.76 లక్షల మంది ఉన్నారు. 2014 నాటికి అప్పు 14,200 కోట్ల పైచిలుకు అయితే.. వాటన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.25,517 కోట్లను నాలుగు విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని గొప్పగా అమలు చేస్తుంది. డ్వాక్రా గ్రూపుల్లో కొంతమంది అక్కచెల్లెమ్మలకు టెక్నికల్ సమస్యలతో సాయం అందలేకపోతుందని చెబుతున్నారు.. వాటన్నింటినీ యుద్ధప్రాతిపదిక పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.