భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం అయ్యారు. ఉజ్బెకిస్థాన్‌లో దాదాపు గంటపాటు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సఖ్యత, తాజా ప్రపంచ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాల్లో రష్యా, భారత్‌ల మధ్య సహకారంపై చర్చించారు.ఈ భేటీలో భాగంగా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంపై కూడా చర్చ జరిగింది.