తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పుడే 2024 ఎన్నికలపై దృష్టి సారించారు.తాజాగా శుక్రవారం మూడు నియోజకవర్గాల పార్టీ ఇంచార్జులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నంద్యాల జిల్లా పాణ్యం, బనగానపల్లె ఇన్‌ఛార్జ్‌లు గౌరు చరితారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు ఏలూరు ఇన్‌చార్జి బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఏ నియోజకవర్గంలో పనిచేసినా నాయకుల పనితీరును బట్టి టికెట్లు కేటాయిస్తామన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజలకు చేరువయ్యి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa