అరకులోయ మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేదవాడికి అన్నం అందించే భాగంగా అరకు నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి కిడారి. శ్రావణ్ కుమార్ అధ్వర్యంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. అన్న క్వాంటిన్ లో ప్రజలను మాజీ మంత్రి రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు దోన్నుదొర ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కిడారి. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.