పల్నాడు జిల్లా, నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలలో కోడెల విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు లేవన్న అధికారులు, హైకోర్టు నోటీసులు ఇచ్చిన పల్నాడు రోడ్డులో ప్రభుత్వ స్థలంలో వైయస్ విగ్రహాన్ని అక్రమంగా ఎందుకు ఏర్పాటు చేశారు? అని టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు ప్రశ్నించారు. ఇప్పటి వరకూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దీనిపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి లేదంటే కోర్టు ధిక్కరణ పై మరో సారి హైకోర్టుకు వెళతాం. వైయస్సార్ విగ్రహాన్ని తొలగించి అదే ప్రాంతంలో మరలా ట్రాఫిక్ సిగ్నల్ ను పునరుద్ధరించాలి అని డిమాండ్ చేసారు.