మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. రాజధాని అంశంపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది. చట్టాలు చేయడంపై అసెంబ్లీ అధికారాలను హైకోర్టు ప్రశ్నించలేదని ఏపీ సర్కారు వాదిస్తోంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.