పిల్లలను తల్లులు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. వారికి ఏ చిన్న ఆపద రాకుండా నిత్యం జాగ్రత్తగా ఉంటారు. అయితే ఓ తల్లి కారులో వెళ్తూ చేసిన స్టంట్స్ నెటిజన్లకు ఆగ్రహం రప్పించాయి. నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి కారులో స్పీడ్‌గా వెళ్తుంది. ఆ సమయంలో ఓ గేటు అడ్డం రాగా పట్టించుకోకుండా ముందుకు పోతారు. గేటు తగిలి ఒక్కసారిగా వారంతా ఎగిరి పడతారు. దీంతో చిన్నారులతో కలిసి చేసే స్టంట్లు వారి ప్రాణాల మీదకు వస్తాయని, తల్లివై ఉండి ఇదేం పని అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.