బీసీ వర్గాల్లో నాయకత్వం పెంచడానికి తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం సాధికార కమిటీలను ఏర్పాటు చేసుకుంది. ఈ కమిటీలను పరిచయం చేసుకునేందుకు సెప్టెంబర్ 21వ తేదీన విజయవాడలో బీసీ సోదరులు సభ నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం బిసి విభాగం లోగోను నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించడం జరిగింది. ఈ సంధర్భంగా అయన మాట్లాడుతూ... బీసీలకు రాజకీయ, పాలన అవకాశాలు ఇచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది తెలుగుదేశం పార్టీ. బీసీ కమిషన్ ఏర్పాటు, విద్య, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, ప్రత్యేక ఉపప్రణాళిక... ఇలాంటివెన్నో బీసీల కోసం చేసింది తెలుగుదేశం.అందుకే బీసీలు ఎల్లప్పుడూ టీడీపీకి అండగా ఉన్నారు అని తెలియజేసారు.