175 నియోజకవర్గాలలో ఉన్న శాసనసభ్యులలో అత్యంత అవినీతిపరుడు బొల్లా బ్రహ్మనాయుడే! అని టీడీపీ నాయకులూ , మాజీ మంత్రి ప్రతి పాటి పుల్లారావు ఆరోపించారు. అయన మాట్లాడుతూ.... దేవాలయం లాంటి అసెంబ్లీని అబద్ధాలు, అసత్యాలకు వేదికగా మార్చిన బొల్లా బ్రహ్మనాయుడు, 20 కోట్ల రూపాయలు లంచం అడిగినట్లు నా మీద ఆరోపణలు చేసిన బొల్లా బ్రహ్మనాయుడు కి వాటిని నిరూపించే దమ్ముందా.? అని ప్రశ్నించారు. ఆయన టెక్స్ టైల్ పార్క్ నిర్మాణం చేయాలని ఉంటే నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో చేయకపోయినా, ఇప్పుడు వాళ్ల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా ఇప్పటివరకు ఎందుకు నిర్మాణం మొదలు పెట్టలేదు అని ప్రశ్నించారు.