ఫొటోలో కనిపిస్తున్న పురుగు విషపూరితం అని, అది మనిషిని కుట్టిన వెంటనే 5 నిమిషాల్లో చనిపోతాడని వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. అయితే, అది ఫేక్ పోస్ట్ అని కృషి విజ్ఞాన కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ది ఎక్కువగా చెరకు, పండ్ల తోటల్లో మాత్రమే కనిపిస్తుందని, పత్తి చేనులో ఉండదని తెలిపింది. ఆ పురుగు శరీరానికి తాకితే దురద, మంట మాత్రమే వస్తుందని, చనిపోయేంత ప్రమాదం ఉండదని పేర్కొంది.