గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, జనసేన అధినేత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధాన మంత్రిగా, గుజరాత్ రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన అజేయ రాజకీయ విజయుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు అసామాన్యమైన భారతదేశపు ప్రధాన మంత్రిగా నిలిచారంటే ఆ రాజకీయ ప్రయాణం ఎంత సంక్లిష్టమైనదో మనం ఊహించవచ్చు. ముఖ్యమంత్రిగా గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన దార్శనికత, ప్రధాన మంత్రిగా క్లిష్టమైన, సున్నితమైన అంశాలపై తీసుకున్న నిర్ణయాలు ఆయనను రాజకీయవేత్తగా అగ్రపథాన నిలిపాయి. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు, కాశ్మీర్ కు సంబంధించిన 370 అధికరణం, ట్రిపుల్ తలాక్ రద్దులు, పౌరసత్వం సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా అమలు వంటివి సాహసోపేత నిర్ణయాలుగా చెప్పవచ్చు. భారతీయ ఔన్నత్యం, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషి కొనయాడతగినది. ప్రధాన మంత్రిగా ఆయన మరిన్ని విజయాలు సాధించాలని, ఆయన నాయకత్వంలో భారత్ అగ్రగామి దేశంగా వెలుగొందాలని కోరుకుంటున్నాను. శ్రీ మోదీ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను అని కోరారు.