విజయనగరం జిల్లా, ఎస్పీ Mrs. M. దీపికా , IPS, ఆదేశాల మేరకు చీపురుపల్లి ఎస్ఐ శ్రీ సన్యాసి నాయుడు గారు మరియు సిబ్బంది సెప్టెంబరు 17న అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగిన ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అతని వద్ద నుండి 102 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అక్రమాలకు పాల్పడితే చట్ట పరిధిలో కఠిన శిక్షలకి గురవుతారు అని హెచ్చరించారు. కాబట్టి మీ జీవితాలు నాశనం కాకుండా, మీ కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా మంచి ప్రవర్తన కలిసి ప్రజలందరూ జీవించాలని హితవు పలికారు.