పల్నాడు జిల్లాలో రాజకీయాలు ప్రతి రోజు వేడిగానే ఉంటాయి. నరసరావుపేట పట్టణంలో పల్నాడు బస్సు స్టాండ్ ఏరియా లో క్రొత్తగా ఏర్పాటు చేసిన రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి అనుమతులు లేవంటూ, నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది. ఈ క్రమంలో దీనిపై స్పందించిన టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ... గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీకు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా పల్నాడు రోడ్డు లో అక్రమంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి అదే ప్రాంతంలో మరలా ట్రాఫిక్ సిగ్నల్ ను పునరుద్ధరించాలని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అని తెలియజేసారు.