జార్ఖండ్ రాజధాని రాంచీలో హృదయాలను కదిలించే ఘటన జరిగింది. హజరారీ బాగ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆవులను చాలా ప్రేమగా పెంచుకునే వాడు. ఇటీవల అతడు చనిపోయాడు. అతడి అంత్యక్రియలకు బంధువులు అంతా సిద్ధం చేశారు. పాడెను శ్మశానానికి తీసుకెళ్లారు. ఇంతలో ఓ దూడ పరుగుపరుగున వచ్చింది. తన యజమానిని కడ చూపు చూసుకునేందుకు పరితపించి పోయింది. చివరికి అక్కడి వారు దారిచ్చి, అతడి మృతదేహాన్ని ఆవు చూసేందుకు అవకాశం కల్పించారు. యజమాని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఆ దూడ అక్కడే ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్గా మారింది. మూగజీవి తన యజమాని పట్ల చూపించిన ప్రేమ నెటిజన్లకు సైతం కన్నీరు రప్పించింది.