ఇండోనేషియా దేశ జనాభాలో 87.2 శాతం మంది ముస్లిములే ఉంటారు. అలాంటి దేశంలో 20,000 వేల నోటుపై వినాయకుని బొమ్మను అక్కడి ప్రభుత్వం ముద్రిస్తోంది. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. తమ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పుడు కరెన్సీ నోట్లపై వినాయకుని బొమ్మ ముద్రించినట్లు ఇండోనేషియా ప్రభుత్వం చెబుతోంది. దీంతో తమ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుందని, ఇదంతా వినాయకుని వల్లేనని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు.