ఓటర్ కార్డుకు ఆధార్ కార్డును ప్రతి ఒక్కరూ లింక్ చేయించుకోవాలని సత్తెనపల్లి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రాజాకుమారి కోరారు. పెద్దకూరపాడులో శుక్రవారం ఆమె మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ బూత్ లెవెల్ అధికారులకు ఓటర్ కార్డు తీసుకెళ్లి ఆధార్ ను అనుసంధానం చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఒకరి ఓటు ఒకరు వేయడానికి వీలు లేకుండా ఉంటుందన్నారు. పెదకూరపాడు మండలంలోని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.