రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులకు బాపట్ల పోలీసులు తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహిస్తున్నారు. జిల్లాలో మద్యం తాగి వాహనం నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నిర్మూలించే ప్రయత్నంలో, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచన మేరకు బాపట్లపోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెంచారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.