అధర్మం అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళినా అంతిమ విజయం న్యాయానిదే అన్నారు లోకేష్, ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంపై ఆయన స్పందించారు. కాగా, పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఈ నిర్ణయంపై ఫైర్ అయ్యారు. అయితే.. ఎలాగైనా మూడు రాజధానులను నిర్మించి తీరుతామంటున్న వైసీపీ ప్రభుత్వం, వచ్చే సంవత్సరం విశాఖ నుంచే కార్యకలాపాలు కొనసాగుతాయంటున్నారు.