మహిళలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రైళ్లతో పాటు, పలు మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించనున్నట్లు వెల్లడించింది. రైల్వేలో మహిళల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేకంగా బెర్త్‌ల రిజర్వేషన్‌తో పాటు మరికొన్ని సౌకర్యాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. మెయిల్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో స్లీపర్ క్లాస్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరు బెర్త్‌లను కేటాయించనున్నారు.