భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ యూనిట్ కు లైన్ క్లియర్ అయింది. ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో ఎటువంటి పెనాల్టీలు లేకుండా యూనిట్ ఏర్పాటుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. రాడార్ టెస్ట్ బెడ్ ఫెసిలిటీ, రక్షణరంగ ఉత్పత్తుల యూనిట్ కోసం ఏపీఐఐసీ 2016లో 914ఎకరాల భూమిని కేటాయించింది.