ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆదివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణలో భాగంగా రామచంద్ర పిళ్లై ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో రామచంద్ర పిళ్లై ఏ-14 గా ఉన్నారు. రామచంద్ర పిళ్లై రాబిన్ డిస్టిలరీస్ పేరుతో వ్యాపారం చేశారు. ఇండో స్పిరిట్స్తో పాటు మరికొంత మంది వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు రామచంద్రపై ఆరోపణలు ఉన్నాయి. రూ.2.30 కోట్ల వరకు వసూలు చేసి ఢిల్లీ పెద్దలకు ఇచ్చారని ఆరోపించారు.