ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ లో దారుణం జరిగింది. మేనకోడలు తప్పిపోయిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వ్యక్తిపై ఓ పోలీస్ దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తప్పిపోయిన తన మేనకోడలు గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తిని చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో బినోలి పీఎస్ ఇన్స్పెక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బిర్జా రామ్‌ను పోలీస్ లైన్‌కు బదిలీ చేశారు.