రాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించడంలో విఫలమైతే టీ20 ప్రపంచకప్ గెలవలేమని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అన్నాడు. సెప్టెంబర్ 20 నుంచి ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఆసీస్‌తో జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ గెలిస్తేనే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకోగలదని గంభీర్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు సాధించిన విజయాలను కూడా గంభీర్ ప్రస్తావించాడు. 'ఇప్పటికే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను. ఆస్ట్రేలియాను ఓడించకపోతే భారత్ టీ20 ప్రపంచకప్ గెలవదు. 2007 T20 ప్రపంచ కప్ చూడండి. సెమీఫైనల్లో ఆసీస్‌ను ఓడించాం. 2011 వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆసీస్‌ను ఓడించాం. ఆస్ట్రేలియా అత్యంత పోటీ జట్లలో ఒకటి. ఏదైనా పెద్ద టోర్నీని గెలవాలంటే ఆ జట్టును ఓడించాలి' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.