గుంటూరు: సత్తెనపల్లిలో యువకుడు లిఫ్ట్ నుంచి పడి తీవ్ర గాయాల పాలైన సంఘటన పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని గుంటూరు రోడ్డులో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో తన ప్లాట్ ను నీటితో తడిపేందుకు సత్తెనపల్లి మండలం గండ్లూరు గ్రామ సర్పంచ్ కుమారుడు బొడ్డు వెంకటేష్ ప్రయత్నిస్తుండగా లిప్ట్ లోనుంచి 9 అడుగుల కిందకు జారిపడ్డాడు. దీంతో వెంకటేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో స్థానికంగా ప్రధమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.