చిలకలూరిపేట పండరీపురంలో ఓ ఇంట్లో వెండి వస్తువులు చోరీకి గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు కరణం వెంకటరమణ వ్యక్తి నాలుగు రోజుల క్రితం వ్యక్తిగత పనులపై బెంగళూరు వెళ్లాడని చెప్పారు. ఆదివారం పనిమనిషి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయని యాజమానికి తెలిపింది. పూజ గదిలో 15 వేల విలువైన వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు అందించారు.