గుంటూరు: సంక్షేమం, సామాజిక న్యాయం పేరు చెప్పి సీఎం జగన్ వెళ్లబుచ్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. దశలవారి మద్యపాన నియంత్రణ, అనంతరం మద్య నిషేధమని చెప్పి సీఎం జగన్ ఆడపడుచులను నయ వంచన చేశారని విమర్శించారు. ఉపాధ్యాయులను కాపలాగా పెట్టి మద్యం అమ్మించిన జగన్ రెడ్డి ఉపాధ్యాయ లోకాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.