సత్తెనపల్లి బీజేపీ దుష్టపాలన నుంచి దేశాన్ని రక్షించాలని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన దేశ రక్షణ భేరీ జాత ఆదివారం పట్టణంలోని వివిధ వార్డుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందన్నారు. ఈనెల 24వ తేదీ విజయవాడలో జరిగే సీపీఎం బహిరంగ సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు.