అనంతపురం: ఓ జంట ప్రేమించుకొని చేసుకున్న కులాంతర వివాహాన్ని పెద్దలు అంగీకరించలేదు. పైగా అబ్బాయికి మరో వివాహం చేశారు. దీంతో యువతి తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ఎదుట మౌన దీక్ష చేపట్టింది. ఈ సంఘటన ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. నేసే కులానికి చెందిన ఓ యువతికి లింగారెడ్డిపల్లిలోని కురబ కులానికి చెందిన బొంతల రాఘవేంద్ర లు పదేళ్ల క్రితం పరస్పరం ప్రేమించుకున్నారు.