దేశంలోని పలు రాష్ట్రాల్లో లంపీ చర్మ వ్యాధి టెన్షన్ పెడుతోంది. రాజస్థాన్లో లంపీ చర్మవ్యాధి అదుపు కావడంలేదు. మరోవైపు దేశంలో సుమారు 75 వేల గోవులు చనిపోయినట్లు సమాచారం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిని అంటువ్యాధిగా ప్రకటించకపోవడంతో పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాస్తున్నాయి. రాజస్థాన్లోనే కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా, యూపీలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది.