పనస పండు గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం మరియు ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా రక్తహీనత తొలగిపోతుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలు, కంటి సమస్యలు దరిచేరవు. వీటిని తరచుగా ఉడకబెట్టి తింటుంటే దంతాలు, ఎముకలు, కీళ్లు బలంగా తయారవుతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.