తాడేపల్లి మండలం పెనుమాక లో దారుణం చోటు చేసుకుంది. చికెన్ షాప్ వద్ద పలువురు వీరంగం సృష్టించి ఏడుకొండలు (55) అనే వ్యక్తి పై ఆదివారం రాత్రి కత్తితో బెదిరించి దాడికి పాల్పడ్డారు. చికిత్స పోందుతున్న బాధితుడు ఏడుకొండలు సోమవారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదుదారుడు చిట్టిపోతుల ఏడుకొండలు పెనుమాక గ్రామంలో చికెన్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. అదే వ్యాపారం చేసే మేడా పూర్ణ చంద్రరావు తరుచుగా ఏడుకొండలుతో వివాదాలకు దిగుతుండేవాడు ఈ క్రమంలో దుకాణ గోడలు విషయంలో పూర్ణ చంద్రరావు, తోకల చిన సాయి, మేడా కుమారి, తోకల సాయి అందరూ కలిసి కర్రతో దాడిచేసి కత్తితో బెరించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.