ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల్లో ఉపాధిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 20, 2022, 01:08 PM

రాజధాని గ్రామాల్లో పేద ప్రజలు ఉపాధి లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారని వీరందరికీ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు అమలు చేసి రూ. 600 కూలి ఇవ్వాలని సిపిఎం పార్టీ రాజధాని డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. భాగ్యరాజ్ డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ దేశ రక్షణ భేరిలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో మంగళవారం కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ భారాలను నిత్యం పెంచుతూ ప్రజలును అనేక ఇబ్బందులు గురిచేస్తుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com