బాబు తెలివితేటలేంటో పోలవరం పనుల్లోనే తెలుస్తోంది . స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తవకుండా కాఫర్ డ్యామ్ కట్టారు. కాఫర్ డ్యామ్‌లలో గ్యాప్‌లు వదిలేయడంతో వరద ఉధృతికి డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీనికి బాబు బాధ్యుడు కాదా? అని సీఎం జగన్ అడిగిన ప్రశ్నకి.... జగన్ రెడ్డీ మీరన్నట్టు ఏ న్యూట్రల్ వ్యక్తి దగ్గరకు పోయినా ఆయన చెప్పేది ఒక్కటే. డిజైన్ లు వేసేది చంద్రబాబు గారు కాదు. ఇందుకోసం కేంద్రం ఆధీనంలో ఉండే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, డ్యాం డిజైన్ రివ్యూ కమిటీలని ఉంటాయి. ఇది కూడా జగన్ రెడ్డికి తెలీదా అని న్యూట్రల్ వ్యక్తి అడుగుతారు. 2020 మే నాటికి కాఫర్ డ్యాంలు పూర్తిచేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీకు చెప్పినప్పటికీ ఏడాదికాలం రివర్స్ టెండరింగ్ అంటూ మీరు కాలయాపన చేసి. ఆ పని పూర్తి చేయకపోవడం వల్లే 2020 వరదల్లో గోదావరి నదీగర్భం కోసుకుపోయి డయాఫ్రం వాల్ దెబ్బతింది కదా అని అడుగుతారు ఆ న్యూట్రల్ వ్యక్తి అని సోషల్ మీడియా టీడీపీ నాయకులూ సమాధానమిచ్చారు.