సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని పురుషుల క్రికెట్ కమిటీ సిఫార్సులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (CEC) ఆమోదించిన తర్వాత, ICC క్రికెట్ నియమాలలో అనేక మార్పులను ప్రకటించింది. ICC తాజా ప్రకటన ద్వారా క్రికెట్‌లో మారిన అనేక నియమాలను ఒకసారి చూద్దాం. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
1. క్యాచ్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి కొత్త బ్యాటర్: ఒక బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు.. క్యాచ్ అవుట్ అయ్యే ముందు బ్యాటర్లు ఒకరినొకరు క్రాస్ చేశారా అనే దానితో సంబంధం లేకుండా.. స్ట్రైకింగ్ కొత్త బ్యాటర్‌కు లభిస్తుంది2. బంతిపై ఉమ్మివేయడం పూర్తిగా నిషేధించబడింది: కరోనా తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో బంతిపై ఉమ్మివేయడం నిషేధించబడిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఇప్పుడు ఉమ్మివేయడం పూర్తిగా నిషేధం.
3. బ్యాటర్ సిద్ధంగా ఉండాలి: టెస్టులు మరియు వన్డేల్లో కొత్త బ్యాటర్ స్ట్రైకింగ్‌లోకి వచ్చి రెండు నిమిషాల్లో బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం టీ20ల్లో ఇది తొంభై సెకన్లు.
4. బాల్ ఆడటానికి స్ట్రైకర్ యొక్క హక్కు: స్ట్రైక్‌లో ఉన్న బ్యాటర్ తన బ్యాట్‌ను గానీ, తన కాలు కొంత భాగాన్ని పిచ్‌లో ఉండేలా చూసుకోవాలి. వారు పిచ్ వీడి లెగ్ సైడ్ గానీ ఆఫ్ సైడ్ గానీ బయటికి వస్తే దాన్ని అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటిస్తాడు. అలా కాకుండా, బౌలర్ స్ట్రైకర్‌కు చాలా దూరంగా బంతిని ఆఫ్ సైడ్ లేదా లెగ్ సైడ్ గా వేస్తే... (వైడ్ దాటి) అంపైర్ నో బాల్‌గా ప్రకటిస్తాడు.
5. ఫీల్డింగ్ మూవ్‌మెంట్‌లో పొరపాటు జరిగితే: పవర్ ప్లే మొదలైన నిబంధనలకు విరుద్ధంగా బౌలర్ బౌలింగ్ చేయడానికి పరిగెడుతున్నప్పుడు ఫీల్డర్ తప్పుగా కదులితే లేదా ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తే, అంపైర్ డెడ్ బాల్ ఇచ్చి పెనాల్టీ విధిస్తారు. బౌలింగ్ జట్టులో.. మరియు బ్యాటింగ్ జట్టు స్కోరుకు ఐదు పరుగులు జతచేస్తుంది.
6. నాన్-స్ట్రైకర్ రన్ అవుట్ : నాన్-స్ట్రైకర్స్ ఎండ్‌లో రనౌట్ అయ్యే పద్ధతి ఇప్పుడు అన్యాయమైన ప్లే విభాగం నుండి రనౌట్ విభాగానికి మార్చబడింది. గతంలో మాన్కడింగ్‌గా పెద్ద దుమారం రేపిన ఈ పద్ధతిని ఇప్పుడు చట్టబద్ధం చేశారు.
7. డెలివరీకి ముందు స్ట్రైకర్ వైపు బంతి విసరడం : ఇంతకు ముందు..బౌలర్ తమ డెలివరీ స్ట్రైడ్‌లోకి ప్రవేశించేముందే బ్యాటర్ వికెట్ల నుంచి పిచ్ ముందుకు దూసుకువస్తే.. బౌలర్ స్ట్రైకర్‌ను రనౌట్ చేయడానికి బంతిని విసిరేవాడు. ఇప్పుడు అలా కుదరదు దాన్ని డెడ్ బాల్‌గా పేర్కొంటారు.
8.ఇతర ప్రధాన నిర్ణయాలు: జనవరి 2022లో T20Iలలో పెనాల్టీ ఫీల్డ్ పరిమితులు ప్రవేశపెట్టబడ్డాయి. (ఫీల్డింగ్ జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్‌లను బౌలింగ్ చేయడంలో విఫలమైతే.. మిగిలిన ఓవర్‌ల కోసం ఒక అదనపు ఫీల్డర్‌ని ఫీల్డింగ్ సర్కిల్‌లోకి తీసుకువస్తారు.). 2023లో ఐసిసి పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పూర్తయిన తర్వాత, వన్డేల్లో కూడా ఈ నిబంధనను ప్రవేశపెట్టనున్నారు.