కర్నూల్లో హైకోర్టు ఏర్పాటయ్యే దాకా తమ పోరాటాలు ఆగవని ధర్మవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ చౌదరి పేర్కొన్నారు. బార్ అసోషియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ప్రదర్శన జరిపి స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఆర్డిఓ తిప్పేనాయకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ సభ్యులు మాట్లాడుతూ జేఏసీ పిలుపుమేరకు రోజువారి నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు.