పేద ప్రజల పట్ల టీడీపీ కి ఉన్న నిబద్దత పేదవారికి ఆత్మ గౌరవం కల్పించాలని నాడు పొన్నూరులో 2368 ప్లాట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన నిర్మాణ విధానాలతో నాణ్యమైన గేటెడ్ కమ్యూనిటీలను తలపించే విధంగా ప్రతి బ్లాక్ ముందు పచ్చని మొక్కలు, ప్రతి బ్లాక్ కి ఒక విద్యుత్ ట్రాన్స్ ఫారం మొత్తం టిడ్కో గృహాల కాలనీకి ఒక విద్యుత్ సభ్ స్టేషన్ , వీధి లైట్లుకు అన్ని రోడ్లకు విద్యుత్ పోల్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగు నీరు వాటర్ సదుపాయాలు, రెండు బస్సులు వచ్చి వెళ్ళేటంత సిమెంట్ రోడ్లు, నలబై అడుగుల అంతర్గత వీధులు , పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసి 95% నిర్మాణాలు పూర్తిచేసి కుల, మత తారతమ్యాలు లేకుండా లాటరీ ద్వారా అన్ని కులాలు మతాలు ఒకే చోట కలసి మెలసి ఉండేలా నిర్మాణాలు చేసి ఎన్నికల కోడ్ వల్ల లబ్ధిదారులకు అందించలేక పోయాం అని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... మూడేళ్లలో ఆ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వకపోగా సీఎం జగన్ కొత్త జగన్నాటకానికి నాంది పలికి నీ వైసీపీ అనుయాయులకు ప్రజా ధనాన్ని పంచేందుకు జగనన్న కాలనీల పేరుతో భూమి కొనుగోలులో, మట్టి రోడ్డు ల నిర్మాణంలో దోచుకోవడం మాత్రమే కాక నేడు అతి దుర్మార్గంగా హద్దులు తొలగించి మీ పార్టీ నాయకుల చేతనే వరి నాట్లు వేయించి భూ ఖాబ్జాకి తెరతీయటం సిగ్గుచేటు. ఆ కాలనీలో సెంటు భూమిలో ఇల్లు కట్టాలంటే ఇంటి నిర్మాణం కన్నా కరెంటు కోసం అయ్యే ఖర్చు అధికం ప్రక్కన ఉన్న ఎన్టీఆర్ గృహాల సముదాయం ఎత్తులో మట్టి పూడ్చి ఇల్లు కట్టాలంటే కనీసం 10 లక్షలు వెచ్చించాలి. నేటి మీ అధికారంలో ఉన్న ధరలు చూస్తే పేద వాడి స్వంత ఇంటి కల కల్లగానే మిగిలిపోతోంది. ఇదేనా నీ చిత్త శుద్ది ఇదేనా మీ సంక్షేమ పాలన జగన్ మోహన్ రెడ్డి!??? ఇప్పటికైనా మిగిలిన కొద్ది శాతం పూర్తి చేసి నాటి లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను మంజూరు చేయకపోతే అన్ని రాజకీయ పక్షాలతో కలసి లబ్ధి దారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని హెచ్చరిస్తున్నాము అని తెలిపారు.