నార్పల మండల కేంద్రంలో తగిరిశపు వెంకట సుబ్బయ్య మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన పార్థివదేహానికీ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బండారు శ్రావణి పూలమాల వేసి నివాళలుర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.