విజయనగరం జిల్లా, ఎస్పీ , Mrs. M. దీపికా, IPS, DPOలో సెప్టెంబరు 19న స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో VC లో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ పి.సత్యనారాయణ రావు, DCRB CI జే. మురళి, SB CIs Ch. రుద్రశేఖర్, G.రాంబాబు, DCRB ఎస్ఐ వాసుదేవ్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.