గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవాడ , తూర్పు నియోజకవర్గం , వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ సారథ్యంలో జరిగింది. ఈ సందర్భంగా అయన 19వ డివిజన్ పిచ్చయ్య రోడ్, మసీద్ రోడ్, కాపు కల్యాణ మండపం రోడ్ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా వారికి అందిన సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి,ఈ మూడేళ్ళ కాలంలో ఈప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించడం జరిగింది.