అమెరికాలోని నెవాడాలో నిర్వహిస్తున్న రీనో ఎయిర్ రేస్‌లో ఇటీవల అనూహ్య ప్రమాదం జరిగింది. ఫైనల్స్ జరుగుతుండగా ఓ జెట్ విమానం అదుపు తప్పింది. హఠాత్తుగా నేలపై కూలిపోయింది. అందరూ చూస్తుండగానే కిందపడి పేలిపోయింది. దాని శకలాలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ పైలట్ మృతి చెందాడు. దుర్ఘటన తర్వాత ఎయిర్ రేస్‌ను రద్దు చేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో పెట్టగా వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa