లవంగాల్లో బీపీ, షుగర్ లెవల్స్ అదుపులో ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తేనె, అల్లం వాటి పొడితో కలిపి తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. అలాగే లవంగాల పొడిని మిరియాలు, కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కఫం తొలగిపోతుంది. వేయించిన లవంగాలు పొడి దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తాయి. వేడి నీళ్లలో 2 లవంగాలు వేసి తాగితే నోటిలోని బ్యాక్టీరియా పోయి నోటి దుర్వాసన పోతుంది.