కలబందతో ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.3 టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జుకు 2 టేబుల్ స్పూన్ల పసుపు, 2 టేబుల్ స్పూన్ల రోజ్‌వాటర్ కలిపి మిక్సీ పట్టాలి. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసి మళ్లీ కలపాలి. ఈ పేస్ట్ లాంటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.