ఈనెల 24వ తేదీన విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో దేశ రక్షణ బేరి సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ బుధవారం మంగళగిరి పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర జరిగింది. టిప్పర్ల బజార్లో యాత్రను సిపిఎం సీనియర్ నాయకులు జెవి రాఘవులు ప్రారంభించి మాట్లాడారు. బిజెపి కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై మోడీ ప్రభుత్వం భారాలని మోపుతుందని విమర్శించారు.
యాత్ర టిప్పర్ల బజార్, నిడమర్ రోడ్డు, పార్క్ రోడ్డు, భగత్ సింగ్ నగర్, కొత్తపేట, దండాలయ్య పేట, ఇందిరానగర్, ఏపీఎస్పీ, ఆంజనేయ కాలనీ తదితర ప్రాంతాల్లో జరిగింది. యాత్రలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ ఎస్ చెంగయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి వై కమలాకర్, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు ఏం బాలాజీ, గణేష్, కే ఏడుకొండలు, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.