పెదకూరపాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పెదకూరపాడు మండలంలోని లింగం గుంట్ల గ్రామానికి చెందిన మహిళ నాయకురాలు లీలావతిని పెదకూరపాడు పోలీసులు బుధవారం ముందస్తు గృహ నిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు గృహ నిర్బంధం చేయటం మహిళా హక్కులను కాలరాయడమే అన్నారు. ఇకనైనా రాష్ట్రంలో జరిగే మహిళలపై దాడులు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.