పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి మండలంలోని ధరణికోట గ్రామంలో బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుండి 9 గంటల వరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు నంబూరు శంకరరావు వ్యక్తిగత కార్యదర్శి దర్శి వెంకటేశ్వరరావు తెలిపారు. అమరావతి మండలం వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు , అభిమానులు, సానుభూతిపరులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.