అమరావతి మండలం మునుగోడు జడ్. పి హైస్కూల్లో బుధవారం ఉదయం గురజాడ అప్పారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. గురజాడ ఆధునిక కవిత్వానికి యుగకర్త అని వ్యావహారిక భాషను రచనల్లో వాడి, దానికీ పుస్తక భాషా స్థాయిని కల్పించిన మహనీయుడని హెచ్. ఎం డాక్టర్ అన్నపురెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీ కారులలో గురజాడ ఒకరని తెలుగు ఉపాధ్యాయులు కె. పద్మజ, టి. అరుణ్ కుమార్ లు పేర్కొన్నారు. గురజాడ వారి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని ప్రముఖ విద్యావేత్త బి. శివరామయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెరేంట్స్ కమిటీ చైర్ పర్సన్ యం. మాధవి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గోన్నారు.